పుట్టనరోజు వేడుకగా జరుపుకున్నారు ఆలియా. భర్తతోనూ, కూతురుతోనూ లండన్‌లో హాయిగా గడిపారు. మూడు పదులు పూర్తయిన సందర్భంగా ఆలియాకు మంచి గిఫ్ట్ ఇచ్చారురణ్‌బీర్ కపూర్. ఆలియాతో పాటు ఆమె తల్లి జోనీ రజ్‌దాన్, సోదరి షహీన్ భట్ కూడా ఉన్నారు. రిలాక్సింగ్ హాలీడేలో ఉన్నట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆలియా. అంత ఆనందంగా గడిపిన క్షణాలకు కాసేపు కామా పెడుతూ, మంగళవారం మధ్యాహ్నం ముంబైలో అడుగుపెట్టారు. ముంబై ఎయిర్‌పోర్టులో సింపుల్‌గా కనిపించిన ఆలియాను కెమెరాలన్నీ పోటీపడి మరీ క్లిక్‌మనిపించాయి. న్యూ మమ్మీ ఇన్ టౌన్ అంటూ మిలియన్ డాలర్ల నవ్వులతో విషయాన్ని పోస్ట్ చేశారు పాపరాజీలు. వైట్ జిప్పర్, బ్లాక్ ట్రౌసర్స్ తో ఎలిగెంట్‌గా కనిపించారు ఆలియా. ఎప్పుడూ తనకు స్పెషల్‌గా అనిపించే గోల్డ్ హూప్ ఇయర్‌రింగ్స్ పెట్టుకున్నారు. పోనీటైల్ స్పెషల్ అట్రాక్షన్‌గా అనిపించింది. క్యాజువల్ అటైర్‌లో చిక్ అనిపించారు ఆలియా. రణ్‌బీర్‌తోనూ, షహీన్‌తోనూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆలియా. లండన్ స్ట్రీట్స్ లో రణ్‌బీర్‌తో సరదాగా గడిపారు ఆలియా. లండన్ 2023 అంటూ భర్తతో ఉన్న ఫొటోలు షేర్ చేశారు. పెళ్లి తర్వాత వీరి బ్రహ్మాస్త్ర సూపర్‌డూపర్ హిట్ అయింది.
ఆలియా నటించిన ట్రిపుల్ ఆర్‌కి ఆస్కార్ వచ్చింది. రణ్‌బీర్ నటించిన తూ జూఠీ మేక్కర్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌తో రాఖీ అవుర్ రాణీ కీ ప్రేమ్ కహానీలో నటిస్తున్నారు ఆలియా. ఇటీవల కశ్మీర్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీ కీ రోల్స్ చేస్తున్నారు. జులై 28న విడుదల కానుంది రాఖీ అవుర్ రాణీ కీ ప్రేమ్ కహానీ. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌తో కలిసి ఆలియా త్వరలోనే జీ లీ జారా షూటింగ్‌లో పాల్గొంటారు ఆలియా. ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని అంటున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ఆలియా హాలీవుడ్ డెబ్యూ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్ విడుదల కూడా ఉంటుంది.